Tuesday, October 3, 2023

renault discounts, Discounts on Cars: డిసెంబర్‌లో అదిరే ఆఫర్లు.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి! – discounts on renault triber, kwid, kiger in december: details on deals and offer


Discounts on Cars: కొత్త సంవత్సరానికి ముందు కారు కొనాలనుకుంటున్నారా? మరి ఏ మోడల్ తీసుకుంటున్నారు? ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? ఎక్కడ తక్కువ ధరకు లభిస్తున్నాయి.? ఇలాంటివి అంతా వెతుకుతూ ఉంటారు. అయితే న్యూఇయర్‌కు ముందు చివరి నెలలో కార్లపై మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి దిగ్గజ కార్ మేకర్లు. ఇటీవల మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్లపై పెద్ద మొత్తంలో తగ్గింపు ప్రకటించగా.. ఇప్పుడు ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ కూడా ఆఫర్లను ప్రకటించింది. రెనాల్ట్ ట్రైబర్ MPV (Renault Triber MPV), రెనాల్ట్ క్విడ్ (Renault Kwid), రెనాల్ట్ కైగర్ SUV (Renault Kiger SUV) లపై గరిష్టంగా రూ. 60 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

కార్లపై డిస్కౌంట్ ప్రకటించడమే కాకుండా.. రెనాల్ట్ కంపెనీ రిలీవ్ స్క్రాపేజ్ స్కీమ్ కింద అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. కార్లపై మీరు ఎక్కువగా డిస్కౌంట్ ఆశిస్తున్నట్లయితే ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి.

Renault Kwid

రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2019లో లాంఛ్ అయింది. దీనిపై ప్రస్తుతం రూ.45 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.10000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలుగా ఉంది. ఇవి ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే లభిస్తాయి. RXE మోడల్ మినహాయించి మిగతా వాటన్నింటిపై రూ.15 వేల మేర ఎక్స్చేంజి బోనస్ కూడా ఉంది. స్క్రాపేజ్ స్కీమ్ బెనిఫిట్ కింద రూ.10 వేలు వస్తాయి. ఈ క్విడ్ కారు రెండు పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది. 54hp, 72Nm 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 68hp, 91Nm 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..
ఉద్యోగులను పీకేసిన 20 దిగ్గజ కంపెనీలు.. దిక్కుతోచని స్థితిలో వేలమంది.. ఐటీకి ఇక కష్టమేనా?లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?
Renault Triber

రెనాల్ట్ ట్రైబర్ కారుపై గరిష్టంగా రూ.60 వేల తగ్గింపు ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.15000 కాగా, ఎక్స్చేంజి బోనస్ రూ.25,000.. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలుగా ఉంది. మరోవైపు స్క్రాపేజ్ స్కీమ్ కింద రూ.10 వేల బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది 72hp, 96 Nm, 1.0 లీటర్ 3- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది.

Renault Kiger

రెనాల్ట్ కైగర్ SUVపై మొత్తంగా రూ.45000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో ఎక్స్చేంజి బోనస్ రూ.15000.. ఒక్క RXE మోడల్ మినహాయించి ఇది పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేల వరకు ఉంది. రూ.10 వేలకు రెండేళ్ల అదనపు వారెంటీతో వస్తుంది. స్క్రాపేజ్ స్కీమ్ బెనిఫిట్స్ కింద మరో రూ.10 వేలు సేవ్ అవుతాయి. ఈ SUV రెండు 1.0 లీటర్ ఇంజిన్లతో వచ్చాయి. 72hp, 96Nm నేచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్ కాగా.. మరొకటి 100hp, 160Nm టర్బోఛార్జ్‌డ్ యూనిట్.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: రూ.3 వేలు పెరిగిన బంగారం ధర.. ఒక్క నెలలో ఇంత ఛేంజ్ ఎందుకు?



Source link

Latest news
Related news