Friday, March 31, 2023

new year car discount, Cars Discount: న్యూ ఇయర్‌కు ముందు గుడ్‌న్యూస్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి! – new year car discount: heavy discounts on mahindra cars, mahindra bolero xuv 300, mahindra thar


Mahindra Cars Discount: మహీంద్రా అండ్ మహీంద్రా.. ఎంపిక చేసిన SUV మోడళ్లపై మంచి డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. కొత్త సంవత్సరానికి ముందు తమ సేల్స్‌ను విపరీతంగా పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ డిసెంబర్‌లో ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనాల్ట్ వంటి కంపెనీలు తమ వివిధ మోడళ్లపై ఎక్స్చేంజి, కార్పొరేట్, స్క్రాపేజ్ వంటి డిస్కౌంట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి చేరింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ నెలలో మహీంద్రా XUV 300, మహీంద్రా బొలెరో, బొలెరో నియో, థార్, మారజ్జో MPV వంటి వాటిపై కస్టమర్లు ఆఫర్లను పొందొచ్చని మహీంద్రా స్పష్టం చేసింది.

మహీంద్రా థార్ SUV (Mahindra Thar SUV) పెట్రోల్, డీజిల్ మోడళ్లపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. వీటి ధర రూ.13.59- 15.82 లక్షల నుంచి రూ.14.16- 16.29 లక్షల వరకు ఉంది. Marazzo MPV లోని M2, M4+ వేరియంట్లపై గరిష్టంగా రూ.67,200 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. M6+ వేరియంట్‌పై రూ.60,200 డిస్కౌంట్ ఉంది. MPV మోడల్ ప్రస్తుత ధర రూ.13.41 లక్షల నుంచి రూ.15.70 లక్షల మధ్యలో ఉంది.

Mahindra Bolero

మహీంద్రా బొలెరో B8 (O) వేరియంట్‌పై మొత్తంగా రూ.80 వేల వరకు బెనిఫిట్స్‌ను పొందొచ్చు. ఎంట్రీ-లెవల్ B2 వేరియంట్ రూ. 33,000 తగ్గింపుతో వస్తుంది. B4, B6 మోడల్‌లు వరుసగా రూ. 70,000, రూ. 75,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బొలెరో B4, బB6, B6 (O) ధరలు వరుసగా రూ.9.53 లక్షలు, రూ.10 లక్షలు, రూ.10.48 లక్షలుగా ఉన్నాయి.

రికార్డులన్నీ తుడిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఎగబడుతున్న జనం.. కళ్లుచెదిరే ఫీచర్లు..!
డిసెంబర్‌లో అదిరే ఆఫర్లు.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి!
లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?

Mahindra Bolero Neo

Mahindra Bolero Neo రూ. 95,000 (N10 & N10 (O) వేరియంట్లు) వరకు తగ్గింపు ఆఫర్‌తో వచ్చింది. N4, N8 మోడల్‌ SUV వరుసగా రూ.68,000, రూ. 70,000 తగ్గింపు ఉంది. బొలెరో నియో N4, N8, N10 R, N10 & N10 (O) ధరలు వరుసగా రూ. 9.48 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 11.21 లక్షలు, రూ. 11.21 లక్షలు, రూ. 11.99 లక్షలుగా ఉంది.

Mahindra XUV300

కార్‌మేకర్ మహీంద్రా XUV300 సబ్‌కాంపాక్ట్ SUV (W8 (O))పై రూ. 1 లక్ష వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. W8, TurboSport W6, TurboSport W8, TurboSport W8 (O) SUV వేరియంట్లు కొనుగోలు చేస్తే రూ. 60,000 వరకు ప్రయోజనం అందుతుంది. బేస్ W4 వేరియంట్ రూ.53,000 డిస్కౌంట్‌తో వస్తుంది, W6 పై రూ.80 వేల వరకు బెనిఫిట్స్ దక్కుతాయి.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..



Source link

Latest news
Related news