నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి హరీష్ పెద్ది సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. అందుకు కారణం.. బాలకృష్ణను ఓ డిఫరెంట్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తూ దర్శకుడు అనీల్ రావిపూడి ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగానే పూర్తవుతూ వచ్చాయి. డిసెంబర్ 8 నుంచి NBK 108 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
అయితే NBK 108 సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై నెట్టింట చాలా వార్తలే వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonalshi Sinha) పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సోషల్ మీడియా ద్వారా సోనాక్షి సిన్హా క్లారిటీ ఇచ్చేసింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్స్ అంత త్వరగా దొరకరనే టాక్ వినిపిస్తుంది. కానీ ఆ టాక్ తన సినిమాకు రాకూడదని దర్శకుడు అనీల్ రావిపూడి భావించారు. అందుకోసం.. ఓ హీరోయిన్‌ను ఓకే చేసేశారట. అది కూడా తెలుగు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరా! అనే సందేహం రాక మానదు. ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar). ప్రియాంకది అనంతపురం. మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయి.
టాక్సీవాలా (Taxiwala), ఎస్.ఆర్.కళ్యాణ మండపం (SR Kalyanamandapam) సినిమాల్లో నటించింది. ఎందుకనో ఆమెకు పెద్దగా లక్ కలిసి రాలేదు. వరుస సినిమాల్లోనూ నటించటం లేదు. ఈ తరుణంలో బాలకృష్ణతో (Balakrishna) సినిమా చేసే అవకాశం రావటం ఆమెకు ప్లస్ అయ్యే అంశమే. మరి ఈ సినిమా తర్వాత అయినా ఆమెకు లక్ కలిసి వస్తుందేమో చూడాలి. రీసెంట్‌గానే ప్రియాంకజవాల్కర్ ఫొటోషూట్‌లోనూ పాల్గొందని టాక్. అయితే NBK 108లో ఆమె మెయిన్ హీరోయినా.. లేక సెకండ్ హీరోయినా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ (NBK 107) సినిమా వీర సింహా రెడ్డి (Veera simha reddy)షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranthi 2023) సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.