నేవీ డే సందర్భంగా విశాఖ(Visakhapatnam)లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాగర తీరంలో నేవీ ప్రదర్శనలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. రాష్ట్రపతితోపాటుగా గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శాసనసభాపతి తమ్మినేని, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని నేవీ వేడుకలను వీక్షించారు.
BREAKING NEWS