Tuesday, October 3, 2023

how to fix dry eyes: కళ్లు పొడిబారాయా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి – care and tips to fix dry eyes

how to fix dry eyes: డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌లో కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. గంటలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌తో గడిపేస్తూ.. కళ్లకు హానిచేస్తున్నాం. ప్రస్తుతం ఉద్యోగాల వల్ల శరీరానికి పని తక్కువగా ఉంటుంది, కళ్లకు మాత్రం విపరీతమైన ఒత్తిడి పడుతుంది పని పడుతుంది. నిద్రపోయినప్పుడు తప్ప కళ్లకు ఏమాత్రం రెస్ట్‌ ఇవ్వడం లేదు. అలిసిన కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వకపోతే… అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వాటిల్లో మొదట వచ్చే సమస్య, డ్రై ఐ సిండ్రోమ్.. అంటే కళ్లు పొడిబారడం. కళ్లలో సరిపడా నీళ్లు ఉత్పత్తి అవ్వక ఈ సమస్య వస్తుంది. కంటి ఆరోగ్యంలో లాక్రిమల్‌ గ్రంథులది ప్రధాన పాత్ర. దీని నుంచి ఉత్పత్తయ్యే లిక్వీడ్స్‌ ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయి. రోజూ ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్‌ వాడే వారిలో కళ్లు డ్రై అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటికి దూరంగా ఉండండి..

టీ, కాఫీ, ఆల్కహాల్‌ వంటి కెఫీన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు, కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి వీటికి దూరంగా ఉండటం మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, స్వీట్స్‌ తక్కువగా తీసుకోవాలి. రిపైన్డ్‌ ఆహారం తగ్గించండి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించండి. ఇవి కళ్లు పొడి బారేలా చేస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

ఇవి తినండి..

ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే సాల్మన్‌, ట్యూన్, సార్డినెస్‌, ట్రౌట్‌, మ్యాకరెల్‌ చేపలను ఎక్కువగా తినాలి. వీటితో పాటు వాల్‌నట్స్‌, బాదం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను రెగ్యులర్‌గా తీసుకోవాలి. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల వాటర్‌ తాగాలి. అప్పుడే మన శరీరంలో కావలసినంత తేమ ఉంటుంది. దీనివల్ల కళ్లు కూడా పొడిబారకుండా ఉంటాయి.

గ్లాసెస్‌ పెట్టుకోండి..

బయటకు వెళ్లేప్పుడు సన్‌గ్లాసెస్‌ పెట్టుకోండి. దీనివల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి కళ్లను రక్షించుకోవచ్చు. వీటి నుంచే కాదు సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచీ.. కళ్లను రక్షించుకోవచ్చు.

ఆ సమయంలో లెన్స్‌ వద్దు..

కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసే వారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే వాటివల్ల కళ్లు పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పని చేయడానికి చీకటి గదులు, ఎయిర్‌ కండిషన్డ్‌ గదుల్లో కాకుండా గాలి, వెలుతురు బాగా వచ్చే ఏరియాస్‌ను సెలెక్ట్‌ చేసుకోండి.

డిజిటల్‌ స్క్రీన్‌ వాడేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కంప్యూటర్‌/ మొబైల్స్‌ వాడేప్పుడు.. చాలా మంది కనురెప్పలు వేయకుండా.. అదే పనిగా చూస్తూ ఉంటారు. దీని వల్ల కళ్లు పొడిబారతాయి. మీరు కళ్లు రెప్పలు ఆర్పడం మర్చిపోవద్దు. ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ను అస్తమానం వాడకూడదని.. మధ్య మధ్యలో గ్యాప్‌ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కంప్యూటర్లు/మొబైల్స్‌ నుంచి వచ్చే యూవీ రేస్‌ నుంచి కళ్లను కాపాడటానికి బ్లూ లైట్‌ ఫిల్టర్‌ గ్లాస్‌లు వాడండి.

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

కళ్లు మంటగా ఉండటం, తరచుగా దురద రావడం, ఎర్రగా మారడం, మసకగా కనిపించడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కన్నీళ్ల నుంచి నీళ్లు రాకపోవడం… ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని చెప్పే లక్షణాలు. వీటిని మొదట్లో గుర్తించి.. జాగ్రత్త పడటం మంచిది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వీరికి ఎక్కువ వస్తుంది..

యాభై సంవత్సరాలు నిండిన స్త్రీలకు, పొల్యూషన్‌లో ఎక్కువగా తిరిగే వారికి, సి-విటమిన్‌ లోపించడం, కళ్లల్లో కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వారికి, స్మోకింగ్‌ చేసే వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేసే వారికి, కొన్ని రకాలైన మందులు (బీపీ, అలర్జి, మానసిక వ్యాధిగ్రస్తుల మందులు, గర్భ నిరోధక మాత్రలు) వాడే వారితో పాటు కీళ్ల నొప్పులు, డయాబెటిస్‌ ట్యాబ్లెట్స్‌ వాడే వారికీ డ్రై ఐ సిండ్రోమ్‌ రావచ్చు.

Latest news
Related news